అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొత్త ర్యాలీ.. ‘అమెరికాను కాపాడండీ’ అంటూ ప్రజలకు పిలుపు

ABN , First Publish Date - 2021-10-11T00:01:12+05:30 IST

మరోమారు అమెరికా అధికార పగ్గాల్ని చేపట్టాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ఈ దిశగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. శనివారం నాడు ఆయన ఐయోవా రాష్ట్రంలో డెస్‌ మోయిన్స్‌లో అమెరికాను కాపాడండీ అంటూ ఓ కొత్త ర్యాలీలో పాల్గొన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొత్త ర్యాలీ.. ‘అమెరికాను కాపాడండీ’ అంటూ ప్రజలకు పిలుపు

ఇంటర్నెట్ డెస్క్: మరోమారు అమెరికా అధికార పగ్గాల్ని చేపట్టాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ఈ దిశగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. శనివారం నాడు ఆయన ఐయోవా రాష్ట్రంలో డెస్‌ మోయిన్స్‌లో అమెరికాను కాపాడండీ అంటూ ఓ కొత్త ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు రిపబ్లికన్లు, అభిమానులు ఆయన వెంట రాగా.. ట్రంప్ స్టేట్ ఫెయిర్ గ్రౌండ్స్‌లో ఆయన పాల్గొన్నారు. బైడెన్ చేతిలో ఓటమి తరువాత తొలిసారిగా ట్రంప్ ఐయోవాలో పర్యటిస్తున్నారు. రాత్రి 8.30 గంటలకు ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాను బైడెన్ సర్వనాశననం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మన దేశాన్ని మనం మళ్లీ వెనక్కు తీసుకుందామని భీకర గర్జన చేశారు. 2022లో జరిగే మిడ్ టర్మ్‌ ఎన్నికల్లో ఐయోవా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ట్రంప్ పిలుపునిచ్చారు.  

Updated Date - 2021-10-11T00:01:12+05:30 IST