కుదుట‌ప‌డ‌ని మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-08-13T16:19:23+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల క‌నిపించ‌లేదు. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ విడుద‌ల చేసిన తాజా మెడికల్ బులెటిన్ ప్రకారం ముఖ‌ర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు...

కుదుట‌ప‌డ‌ని మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల క‌నిపించ‌లేదు. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ విడుద‌ల చేసిన తాజా మెడికల్ బులెటిన్ ప్రకారం ముఖ‌ర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు రాక‌పోవ‌డంతో వెంటిలేటర్‌పైననే ఉన్నారు. ముఖ‌ర్జీ ఆరోగ్య‌ పరిస్థితి విషమంగా మార‌డంతో ఆగస్టు 10 న ఆర్మీ హాస్పిటల్‌లో చేరారు. మెదడులోని రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయ‌న‌కు శస్త్రచికిత్స చేశారు. ఆ త‌రువాత నుంచి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వెంటిలేటర్‌పైన‌నే ఉన్నారు. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజీత్ ముఖర్జీ ఒక ట్వీట్‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి రక్తపోటు స్థిరంగా ఉంద‌ని, గుండె పనిచేస్తోంద‌ని తెలిపారు. కాగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి మెదడుకు శస్త్రచికిత్స చేసేముందు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. 

Updated Date - 2020-08-13T16:19:23+05:30 IST