Abn logo
Aug 11 2020 @ 06:25AM

బ్రెయిన్ స‌ర్జ‌రీ అనంత‌రం వెంటిలేట‌ర్‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌‌ణ‌బ్ ముఖర్జీ

న్యూఢిల్లీ: భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నారు. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌‌ణ‌బ్ ముఖర్జీకి క‌రోనా సోక‌డంతో ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ముఖర్జీ ట్వీట్ చేస్తూ... తాను సాధార‌ణ‌ వైద్య‌పరీక్షల‌ కోసం ఆసుపత్రికి వెళ్ల‌గా, కోవిడ్ -19 టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింద‌ని తెలిపారు. గత వారం రోజులుగా త‌న‌ను క‌లుసుకున్న‌వారంతా కోవిడ్ -19 పరీక్షించుకోవాల‌ని కోరుతున్నాన‌ని అన్నారు. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌‌ణ‌బ్ ముఖర్జీకి ‌బ్రెయిన్ స‌ర్జ‌రీ ‌విజయవంతంగా జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్‌అండ్‌ఆర్ ఆసుపత్రిని సందర్శించి, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌‌ణ‌బ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

Advertisement
Advertisement
Advertisement