అమెరికా మాజీ అధ్యక్షుడు Bill Clintonకు బ్లడ్ ఇన్ఫెక్షన్...ఆసుపత్రిలో చేరిక

ABN , First Publish Date - 2021-10-15T14:08:51+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యతో కాలిఫోర్నియాలోని ఆసుపత్రిలో చేరారు...

అమెరికా మాజీ అధ్యక్షుడు Bill Clintonకు బ్లడ్ ఇన్ఫెక్షన్...ఆసుపత్రిలో చేరిక

కాలిఫోర్నియా: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యతో కాలిఫోర్నియాలోని ఆసుపత్రిలో చేరారు. 75 ఏళ్ల బిల్ క్లింటన్ ను కాలిఫోర్నియాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ మెడికల్ సెంటర్‌ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.గతంలో బిల్ క్లింటన్ గుండె, కొవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. క్లింటన్ ను వెంటిలేటరుపై ఉంచలేదని, అతని మానసిక స్థితి బాగానే ఉందని అతని ప్రతినిధి ఏంజెల్ యురేనా ట్విట్టరులో తెలిపారు. 


క్లింటన్ కు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ఏంజెల్ కృతజ్ఞతలు తెలిపారు. బిల్ క్లింటన్ కు ఐవీ యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ ఇస్తున్నామని అతని వైద్యులు డాక్టర్ అల్పేష్ అమిన్, డాక్టర్ లిసా బార్డాక్ లు చెప్పారు. అతనికి తెల్ల రక్త కణాళ సంఖ్య తగ్గుతుండటంతో చికిత్స అందిస్తున్నామని యాంటీబయాటిక్స్ కు బాగా స్పందిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.


Updated Date - 2021-10-15T14:08:51+05:30 IST