Karimnagar: ఇళ్లందుకుంటలో ఇందిరాశోభన్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-27T16:48:11+05:30 IST

జిల్లాలోని ఇళ్ళందకుంటలో వైఎస్సార్‌టీపీ మాజీ నేత ఇందిరాశోభవన్ ఉపాధి భరోసా యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Karimnagar: ఇళ్లందుకుంటలో ఇందిరాశోభన్ అరెస్ట్

కరీంనగర్: జిల్లాలోని ఇళ్ళందకుంటలో వైఎస్సార్‌టీపీ మాజీ నేత ఇందిరాశోభవన్ ఉపాధి భరోసా యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఇళ్ళందకుంటలో ఇందిరాశోభన్ ఉపాధి భరోసా యాత్రను చేపట్టారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఇందిరాశోభవన్ వాగ్వాదానికి దిగారు. చివరకు ఇందిరాశోభన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఉపాధి భరోసా యాత్ర కోసం రెండ్రోజుల క్రితమే పర్మిషన్ కోసం సీపీకి లెటర్ పెట్టామని ఇందిరాశోభన్ తెలిపారు. అయితే మొదట పాదయాత్రకు అనుమతిచ్చి.. తర్వాత మాట మార్చారని ఇందిర ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-27T16:48:11+05:30 IST