రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-30T05:44:47+05:30 IST

రైతు సంక్షేమమే ప్ర భుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ ప్రధాన సల హాదారులు అంబటి కృష్ణారెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ద్రోణాదులలో మినుము విత్తనాలను పంపిణీ చేస్తున్న అంబటి కృష్ణారెడ్డి, రావి రామనాథంబాబు

పర్చూరు, జూలై 29: రైతు సంక్షేమమే ప్ర భుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ ప్రధాన సల హాదారులు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. గురు వారం మండలంలోని నూతలపాడు గ్రామంలో రైతుభరోసా కేంద్రం వద్ద రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. రైతు సమస్యలను తెలుసుకొని సత్వర పరి ష్కారంతోపాటు, మెరుగైన సేవలు అందించా లన్న సంకల్పంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు మాట్లా డుతూ  వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకట మురళి మాట్లాడుతూ సిబ్బంది  రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. 

కార్యక్రమంలో జిల్లా సలహా మండలి అధ్యక్షుడు ఆళ్ళ రవీంధ్రారెడ్డి, ఏపీఎంఐపీ పీపడీ రవీంధ్రబాబు, జేడీఏ ఎస్‌.శ్రీనివాసరావు,  సర్పంచ్‌ కాకర్లమూడి చెన్నయ్య, తహసీల్దార్‌ బత్తుల బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు

మార్టూరు, జూలై 29: రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల కు నాణ్యమైన విత్తనాలు, ఎరు వులు, పురుగుమందులు అందజే స్తున్నట్టు  రాష్ట్ర ప్రభుత్వ వ్యవ సాయ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ద్రోణాదులలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు. గ్రామాలలో రెవెన్యూపరంగా తమ సమస్యలను తెలిపితే  ప్ర భుత్వం దృష్టికి తీసుకుకెళతానన్నారు. దాంతో సమావేశంలో కొంత మంది రైతులు పాస్‌బుక్‌ల కోసం నెలలు తరబడి అధికారులు చు ట్టూ తిరుగుతున్నామన్నారు. వీరి సమస్యలను వెంటనే పరిష్కరించా లని తహసీల్దార్‌ ఈదా వెంకటరెడ్డికి సూచించారు. అనంతరం రైతుల కు మినుము విత్తనాలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రావి రామనాథంబాబు, గ్రామ సర్పంచ్‌ వంకా యలపాటి భాగ్యారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T05:44:47+05:30 IST