అయ్యో..

ABN , First Publish Date - 2020-12-04T05:52:10+05:30 IST

చేతికి వచ్చే సమయంలో వరిపంట నివర్‌ తుఫాన్‌తో నేలకొరిగింది. చాలాచోట్ల వరిధాన్యం కోతకోయకనే మొలకలు వస్తున్నాయి.

అయ్యో..
వర్షానికి తడవకుండా పట్టలు కప్పుతున్న రైతన్న

చేతికి వచ్చే సమయంలో వరిపంట నివర్‌ తుఫాన్‌తో నేలకొరిగింది. చాలాచోట్ల వరిధాన్యం కోతకోయకనే మొలకలు వస్తున్నాయి. ఆ పంటనైనా దక్కించుకునేందుకు అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఖాజీపేట రైతులు బురదలోనే వరికోత యంత్రంతో నూర్పిడి చేయించుకుని ఇక్కడి జాతీయ రహదారిలో ధాన్యం ఆరబెట్టారు. అయినా వరుణుడు పగబట్టినట్లు గురువారం వర్షం కురిపించాడు. దీంతో అన్నదాతలు ఆరబెట్టిన వడ్లను వడివడిగా కుప్పదోసి పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు.

- ఖాజీపేట

Updated Date - 2020-12-04T05:52:10+05:30 IST