అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2021-06-04T05:19:19+05:30 IST

రాజానగరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 304 అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్‌ నెల నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయను న్నట్టు సీడీపీవో టి.నాగమణి గురువారం తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ

రాజానగరం, జూన్‌ 3: రాజానగరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 304 అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్‌ నెల నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయను న్నట్టు సీడీపీవో టి.నాగమణి గురువారం తెలిపారు. రాజానగరం, రాజమహేం ద్రవరం రూరల్‌, కడియం మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు 2903 మంది, బాలింతలు 1844 మంది, 6272 మంది 3-6 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ నెల నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యంతో వండిన బలవర్ధక ఆహారాన్ని అందించనున్నామని చెప్పారు. భావితరాలకు బంగారు భవిష్యత్తు కార్యక్రమం లో భాగంగా 304 అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం కేటాయించి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారన్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం లో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉండడంతోపాటు రక్త హీనతను నివారించే ఐరన్‌, గర్భస్థ శిశువు వికాసానికి ఫోలిక్‌ ఆమ్లం, నాడీ వ్యవస్థ అభివృద్ధి కోసం విటమిన్‌ బి12 ఉంటాయని నాగమణి చెప్పారు.

Updated Date - 2021-06-04T05:19:19+05:30 IST