Abn logo
Sep 23 2021 @ 09:44AM

mumbai: బీచ్‌లో 40 అడుగుల తిమింగలం

సెల్ఫీలు,వీడియోలు తీసుకున్న స్థానికులు

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై వాసాయిలోని మార్డెస్ బీచ్‌లో ఓ భారీ తిమింగలం కళేబరం వెలుగుచూసింది. అరేబియా సముద్రం నుంచి సముద్రపు ఒడ్డుకు కొట్టుకుపోయిన 30 టన్నుల బరువున్న 40 అడుగుల పొడవున్న తిమింగలం కళేబరాన్ని అధికారులు గుర్తించారు. భారీ సముద్ర జీవి అయిన తిమింగలం ఆగస్టులో చనిపోయి ఉండవచ్చునని అధికారులు చెప్పారు. అధిక అలల సమయంలో తిమింగలం సముద్ర తీరానికి  కొట్టుకువచ్చింది. 

తిమింగలం జాతిని నిర్ధారించడానికి అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. తిమింగలం అప్పటికే బాగా కుళ్లి పోవడంతో అది ఏ జాతిది అనేది గుర్తించలేక పోయారు. బీచ్ లో తీవ్ర దుర్వాసన వెలువడింది. తిమింగలం కళేబరం తొలగించడం కష్టమని, దాన్ని బీచ్ లోనే పూడ్చిపెడతామని అధికారులు చెప్పారు. బీచ్‌లో భారీ తిమింగలం కళేబరాన్ని  చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తిమింగలం కళేబరంతో సందర్శకులు సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. దీంతో మార్డెస్ బీచ్‌లో సందడి నెలకొంది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...