Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 27 2021 @ 12:31PM

man animal conflict: మూడేళ్లలో 45 ఏనుగులు, 204 మంది ప్రజల మృతి

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో గడచిన మూడేళ్లలో 45 ఏనుగులు, 204 మంది ప్రజలు మరణించారని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ముహమ్మద్ అక్బర్ అసెంబ్లీలో వెల్లడించారు. జనతాకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధాంజిత్ సింగ్ అడిగిన ప్రశ్నకు అటవీశాఖ మంత్రి అక్బర్ సమాధానమిచ్చారు. 2018 నుంచి 2020 వరకు మూడేళ్లలో 45 ఏనుగులు మరణించాయని మంత్రి చెప్పారు. ఏనుగల దాడి వల్ల 204 మంది అటవీ గ్రామాల ప్రజలు మరణించగా, మరో 97 మంది తీవ్రంగా గాయపడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఏనుగుల దాడి వల్ల ప్రాణనష్టంతోపాటు పంట నష్టం, ఇళ్ల ధ్వంసం జరిగిందని, బాధితులకు 57,81,63,655రూపాయలను నష్టపరిహారంగా ఇచ్చామని మంత్రి చెప్పారు. ఉత్తర చత్తీస్ ఘడ్ లోని సుర్ గుజా ప్రాంతంలో 240 ఏనుగులు సంచరిస్తున్నాయని, దీనివల్ల తరచూ పంటపొలాలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని మంత్రి చెప్పారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 225 నుంచి 290కి పెరిగాయని మంత్రి అక్బర్ వివరించారు.

Advertisement
Advertisement