cruise party: మహిళల శానిటరీ ప్యాడ్లు, మెడిసిన్ బాక్సుల్లో డ్రగ్స్ లభ్యం

ABN , First Publish Date - 2021-10-04T15:50:53+05:30 IST

ముంబై సముద్ర తీరంలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో జరిగిన దాడిలో సంచలన విషయాలు వెలుగుచూశాయి....

cruise party: మహిళల శానిటరీ ప్యాడ్లు, మెడిసిన్ బాక్సుల్లో డ్రగ్స్ లభ్యం

ముంబై : ముంబై సముద్ర తీరంలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో జరిగిన దాడిలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. క్రూయిజ్‌ పార్టీలో డ్రగ్స్ మహిళల శానిటరీ ప్యాడ్లలో లభించాయి.మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్సీబీ) దాడి చేసినపుడు క్రూయిజ్ లో డ్రగ్స్ ను మహిళల శానిటరీ ప్యాడ్లు, మెడిసిన్ బాక్సుల్లో కనుగొన్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన లెన్స్ బాక్స్‌లో డ్రగ్స్ తీసుకెళుతున్నాడని ఎన్సీబీ అధికారులు చెప్పారు.ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ అధికారులు నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ లోని నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు.


ముంబై కోర్టు ఆర్యన్ ఖాన్ తోపాటు మరో ఇద్దరిని అక్టోబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది.ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాటింగుల్లో అతని స్నేహితులతో డ్రగ్స్ గురించి చర్చించారని ఎన్సీబీ అధికారులు చెప్పారు. చరాస్, కొకైన్ సహా పలు రకాల మాదకద్రవ్యాలు క్రూయిజ్ లో లభించాయి.


Updated Date - 2021-10-04T15:50:53+05:30 IST