‘టెస్కాబ్’కు నాలుగు అవార్డులు...

ABN , First Publish Date - 2021-10-25T07:43:21+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు(టెస్కాబ్)కు నాలుగు ప్రతిషఫ్టాత్మక అవార్డులు లభించాయి.

‘టెస్కాబ్’కు నాలుగు అవార్డులు...

కరీంనగర్/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు(టెస్కాబ్)కు నాలుగు ప్రతిషఫ్టాత్మక అవార్డులు లభించాయి. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ సమ్మిట్(ఎన్‌సీబీఎస్) నేపధ్యంలో ఈ అవార్డులను అందించారు. బ్యాంకు ఛైర్మన్ రవీందర్, మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ ఈ అవార్డులను అందుకున్నారు. 


ఫ్రాంటియర్స్ ఇన్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్ వర్చువల్ మోడ్ ద్వారా అవార్డులను అందించారు. ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు నేతృత్వంలో, మేనేజింగ్ డైరెక్టర్ నేతి మురళీధర్ సారధ్యంలో టెస్కాబ్ ఈ అవార్డులను గెలుచుకుందని అధికారులు పేర్కొన్నారు. టెస్కాబ్ ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ ఎన్‌పీఏ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడి చొరవ, ఉత్తతమ హెచ్‌ఆర్ ఆవిష్కరణ అవార్డులను గెలుచుకుంది. 


కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ షాజీ కేవీ, ఎఫ్‌సీయూబీ జ్యోతీంద్ర మెహతా, ఆర్ధిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా... దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ‘టెస్కాబ్’ను నాబార్డ్ గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా ఛైర్మన్, అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెస్కాబ్ ఉద్యోగులను అభినందించారు. కాగా కరీంనగర్ డీసీసీబీకి బ్యాంకింగ్ పాట్రియర్స్ ద్వారా ఉత్తమ క్రెడిట్ గ్రోత్ బ్యాంక్ అవార్డు దక్కింది. ఇక వాణిజ్య బ్యాంకుల మాదిరిగా కాకుండా డీసీసీబీల్లో... ‘దాచిన ఛార్జీలు’ ఉండవని పవక్తలు పేర్కొన్నారు. 

మురళీధర్ మూడవసారి...

కాగా డాక్టర్ నేతి మురళీధర్ వరుసగా మూడవసారి టెస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్/ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా నియమితులయ్యారు.  

Updated Date - 2021-10-25T07:43:21+05:30 IST