నలుగురు సీబీఐ అధికారులపై వేటు

ABN , First Publish Date - 2021-01-17T07:50:32+05:30 IST

ఒక అవినీతి కేసుకు సంబంధించి సీబీఐలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఆ దర్యాప్తు సంస్థ సస్పెండ్‌ చేసింది. మరో ఇద్దరు ఉన్నతాధికారులపై పాలనాపరమైన చర్య

నలుగురు సీబీఐ అధికారులపై వేటు

బ్యాంకు అవినీతి కేసులో ఇద్దరు సస్పెన్షన్‌, ఇద్దరిపై చర్య


న్యూఢిల్లీ, జనవరి 16: ఒక అవినీతి కేసుకు సంబంధించి సీబీఐలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఆ దర్యాప్తు సంస్థ సస్పెండ్‌ చేసింది. మరో ఇద్దరు ఉన్నతాధికారులపై పాలనాపరమైన చర్య తీసుకుంది. ఒక బ్యాంకు మోసం కేసులో నిందితుడి వద్ద నుంచి వీరు ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.


ఎఫ్‌ఐఆర్‌లో ఈ నలుగురి పేర్లను నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవినీతి కేసుకు సంబంధించి సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం తన సంస్థలోని ఈ అధికారుల ఇళ్లలో గురువారం సోదాలు జరిపింది. సీబీఐలో డీఎస్పీ ర్యాంకు అధికారి ఆర్కే  రుషి, అదే హోదాగల మరో అధికారి ఆర్కే సాంగ్వాన్‌లపై పాలనాపరమైన చర్య తీసుకున్నారు. అలాగే ఇన్‌స్పెక్టర్‌ కపిల్‌ ధన్‌కడ్‌, స్టెనో సమీర్‌ కుమార్‌ సింగ్‌లను సస్పెండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-17T07:50:32+05:30 IST