Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

 విశాఖ/ తూర్పు గోదావరి: రాష్ట్ంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.


విశాఖ జిల్లాలోని  నక్కపల్లి మండలం ఉదండపురం జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.  తలుపులమ్మలోవ అమ్మవారి దర్శనానికి భార్యాభర్తలు, వదిన, ఐదు నెలల చిన్నారి వెళ్లివస్తున్నారు. నక్కపల్లి మండలం ఉదండపురం జంక్షన్ జాతీయ రహదారిపై డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై పడటంతో దుర్గ, కామేశ్వరిపై వ్యాన్ వెళ్లింది. దుర్గ, కామేశ్వరి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భర్త రాజ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలం వన్నెపూడి జంక్షన్‌ దగ్గర డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement