ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌: మరో ఇద్దరు గెలుపు!

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి మరో ఇద్దరు ఈసీ మెంబర్లు గెలపొందారు. శివారెడ్డి, కౌశిక్‌ గెలుపొందినట్లు వచ్చిన వార్తల అనంతరం.. కొద్ది క్షణాల్లోనే అనసూయ, సురేశ్‌ కొండేటి గెలుపొందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి నలుగురు ఈసీ మెంబర్లు గెలుపొందారు. అనసూయకు, శివారెడ్డికి అత్యధిక ఓట్లు పోల్‌ అయినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈసీ మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈసీ మెంబర్ల కౌంటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు ప్యానల్ నుండి 10 మంది ఈసీ మెంబర్స్ ఆధిక్యంలో ఉండగా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి 8 మంది లీడ్‌లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్‌కి ఉన్న లీడ్‌లో 4గురు గెలవగా 4గురు లీడ్‌లో ఉన్నారు.  

Advertisement
Advertisement