కాలిఫోర్నియాలో కాల్పులు.. చిన్నారి సహా నలుగురు మృతి !

ABN , First Publish Date - 2021-04-01T16:50:40+05:30 IST

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఆఫీస్ భవనంపై బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి.

కాలిఫోర్నియాలో కాల్పులు.. చిన్నారి సహా నలుగురు మృతి !

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఆఫీస్ భవనంపై బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. లాస్​ ఏంజిల్స్‌కు దక్షిణాన ఆరెంజ్​లోని 202డబ్ల్యూ. లింకన్ అవెన్యూ వద్ద రెండు అంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం 5:30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగినట్టు పోలీస్ అధికారిణి లెఫ్టినెంట్ జెన్నిఫర్ అమత్ వెల్లడించారు. కార్యాలయ భవనంలోని రెండో అంతస్తులో దుండుగుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడని ఆమె తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారని జెన్నిఫర్ చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు గాయపడడంతో అతడ్ని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ దాడి వెనుక ఉన్న కారణాన్ని నిందితుడు ఇంకా చెప్పలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు జెన్నిఫర్ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-04-01T16:50:40+05:30 IST