కరోనాతో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-24T07:28:04+05:30 IST

24 గంటల్లో చిత్తూరు జిల్లాలో కొవిడ్‌తో నలుగురు మృత్యువాత పడ్డారు.

కరోనాతో నలుగురి మృతి

తిరుపతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మరణాలకు ఒక్క రోజే విరామం లభించింది. మరణాలేవీ నమోదు కాకుండా 24 గంటలు గడిచాయో లేదో అంతలోనే కొవిడ్‌తో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆది, సోమవారాల నడుమ 113 కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించగా అదే వ్యవధిలో రాష్ట్రంలోనే అధికంగా నాలుగు మరణాలు నమోదయ్యాయి. కొత్తగా గుర్తించిన కేసులతో జిల్లాలో మొత్తం కేసులు 236397కు చేరుకోగా మరణాల సంఖ్య 1817కు పెరిగింది. కాగా సోమవారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 1736 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. తాజా కేసులు తిరుపతిలో 24, చిత్తూరులో 8, రేణిగుంటలో 7, మదనపల్లె, శ్రీకాళహస్తి మండలాల్లో 6 చొప్పున, తిరుపతి రూరల్‌లో 5, పీలేరు, తవణంపల్లె, తొట్టంబేడు, జీడీనెల్లూరు మండలాల్లో 4 వంతున, ఎర్రావారిపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, పుత్తూరు, పూతలపట్టు, బీఎన్‌ కండ్రిగ, వెదురుకుప్పం, బంగారుపాళ్యం, యాదమరి, పాకాల, సోమల, వరదయ్యపాళ్యం, శ్రీరంగరాజపురం మండలాల్లో 2 చొప్పున, సదుం, రొంపిచెర్ల, బైరెడ్డిపల్లె, పెనుమూరు, గుడిపాల, గంగవరం, నాగలాపురం, ములకలచెరువు, నిండ్ర, పెద్దపంజాణి, వాల్మీకిపురం, నారాయణవనం, పెద్దమండ్యం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-08-24T07:28:04+05:30 IST