Advertisement
Advertisement
Abn logo
Advertisement

Four kilograms of marijuana పట్టివేత..ఇద్దరు నిందితుల అరెస్ట్‌

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీ్‌సలు అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు. అప్పర్‌ ధూల్‌పేట్‌ ప్రాంతంలో నివాసం ఉండే బాలాజీ దుర్గేష్‌ సింగ్‌(26), బాలాజీ అకాష్‌ సింగ్‌(24) అన్నదమ్ములు. వీరిద్దరు స్థానికంగా టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తుల దాదాపు రూ. లక్ష విలువ ఉన్న నాలుగు కిలోల గంజాయిని కొనుగోలు చేసి శనివారం మధ్యాహ్నం  సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోఠి 94 బస్‌ స్టార్‌ గల్లీ నుంచి బ్యాగ్‌లో తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించి ఇద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement