Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏకాంత ప్రదేశంలో ఇద్దరు ప్రేమికులు.. అంతలో అక్కడికి చేరిన నలుగురు పోలీసులు.. ఆ ప్రేమికలని బెదిరించి వాళ్లు ఏం చేశారంటే..

పోలీసులమంటూ ఇద్దరు అమాయక ప్రేమికులని నలుగురు దుండగులు దోచుకున్నారు. పైగా యువతి మైనర్ కావడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతామని బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘోరం జరిగిన తరువాత ఆ యువతి పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక అష్టకష్టాలు పడింది. చివరికి ఆ యువతి కుటంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుని త్వరగా విచారణ చేపట్టిన పోలీసులు చివరికి ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన బీహార్ రాజధాని పట్నాలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. పట్నాలో నివసించే జాన్వి(15, పేరు మార్చబడినది) తన బాయ్‌ఫ్రెండ్‌ అవినాశ్‌తో కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో సమయం గడుపుతుండగా.. రెండు బైక్‌లపై నలుగురు యువకులు అక్కడికి వచ్చి జాన్వి, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఫొటోలను తీశారు. తాము పోలీసులమని వెంటనే పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారు. అందుకు జాన్వి బాయ్‌ఫ్రెండ్ అవినాశ్ వాళ్లని వదిలేయమని బతిమాలాడు. కానీ వాళ్లు అవినాశ్‌ని ముందు ఒకచోటు కట్టేశారు. జాన్విని పక్కనే ఉన్న పొదల చాటున తీసుకెళ్లి ఆమెపై అత్చాచారం చేసి చితకబాదారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. వెళ్లేటప్పుడు జాన్వి, అవినాశ్ వద్దనున్న డబ్బు, మొబైట్ ఫోన్లు కూడా తీసుకెళ్లారు.


ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక జాన్వి స్ప‌ృహ కోల్పోయి పడిపోయింది. ఆమె బట్టలు చినిగిపోయి ఉన్నాయి. అప్పుడు అవినావ్ ఆమెను ఎలాగోలా స్పృలోకి తెచ్చి దెగ్గరలోని ఒక ఇంటివారి సహాయంతో జాన్వి తండ్రికి ఫోన్ చేశాడు. జాన్వి తండ్రి అక్కడికి చేరుకొని వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తరువాత పోలీసులకు జాన్వి ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన ఆ నలుగురిని శిక్షించి తనకు న్యాయం చేయమని పోలీసులను కోరింది. 


పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో విచారణ చేసి నలుగురిలో ఒకడైన నిందితుడిని పట్టుకున్నారు. త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాన్వి తండ్రి ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై కూడా అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని కూడా పోలీసులు పట్టుకొని విచారణ చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement