రాలుతున్న పండుటాకులు.. కాకినాడలో కొవిడ్‌తో నలుగురి మృతి

ABN , First Publish Date - 2020-07-18T14:29:17+05:30 IST

కొవిడ్‌ బారిన పడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నలుగురు శుక్రవారం మృతి చెందారు. కాకినాడకు చెందిన వృద్ధుడు (65) అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతన్ని ఈనెల 13న జీజీహెచ్‌లో చేర్చారు.

రాలుతున్న పండుటాకులు.. కాకినాడలో కొవిడ్‌తో నలుగురి మృతి

జీజీహెచ్‌(కాకినాడ): కొవిడ్‌ బారిన పడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నలుగురు శుక్రవారం మృతి చెందారు. కాకినాడకు చెందిన వృద్ధుడు (65) అనారోగ్యానికి  గురయ్యాడు. దీంతో అతన్ని ఈనెల 13న జీజీహెచ్‌లో చేర్చారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ తేలింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాకినాడ లలితా నగర్‌కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో ఈనెల 15న జీజీహెచ్‌లో చేరాడు. పాజిటివ్‌ రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెదపూడికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఈ నెల 15న జీజీహెచ్‌లో చేరాడు. అతనికి పాజిటివ్‌ సోకింది. కొవిడ్‌ వార్డులో మృతి చెందాడు. రాజమహేంద్రవరం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చేరారు. అక్కడ చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణయ్యింది. ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 13న కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిందని నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం కిరణ్‌ తెలిపారు.

  

బండారులంకలో వృద్ధురాలు..

బండారులంకకు  చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కొన్నిరోజులుగా అనారోగ్యం తో అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహిం చగా శుక్రవారం ఆమెకు పాజిటివ్‌గా తేలింది. మున్సిపల్‌ సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2020-07-18T14:29:17+05:30 IST