మరో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-08T04:12:18+05:30 IST

రోనాతో పోరాడుతూ.. జిల్లాలో మరో నలుగురు శుక్రవారం మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో ఇంకో 1,632 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా పరీక్షలు వేగం పెంచినా.. కొన్ని ప్రాంతాల్లో ఫలితాలు వచ్చేసరికి రెండు, మూడురోజులు పడుతోంది. శుక్రవారం 5,286 మందికి కరో

మరో నలుగురి మృతి




జిల్లాలో కొత్తగా 1,632 మందికి కరోనా పాజిటివ్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 7 : కరోనాతో పోరాడుతూ.. జిల్లాలో మరో నలుగురు శుక్రవారం మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో ఇంకో 1,632 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా పరీక్షలు వేగం పెంచినా.. కొన్ని ప్రాంతాల్లో ఫలితాలు వచ్చేసరికి రెండు, మూడురోజులు పడుతోంది. శుక్రవారం 5,286 మందికి కరోనా పరీక్షలు చేయగా, 1632 మందిలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. జిల్లాలో ఇప్పటి వరకు 11,12,016 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 82,821కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. శుక్రవారం 1,322 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 16,513 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 1,011 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1,948 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 19,472 ఉన్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా మధ్యాహ్నం వేళ.. కర్ఫ్యూ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలు తెరచుకోగా.. తీవ్ర రద్దీ నెలకొంటోంది. పోలీసులు జిల్లా అంతటా పక్కాగా కర్ఫ్యూలు అమలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. 

 .

 

Updated Date - 2021-05-08T04:12:18+05:30 IST