కరోనా కలకలం.. ఆక్సిజన్ అందక ఆగిన నలుగురి ఊపిరి.. గంటల వ్యవధిలో దారుణం..!

ABN , First Publish Date - 2020-07-11T19:53:54+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. గురువారం రాత్రి వేళ.. అదీ గంటల వ్యవధి లోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనాతో ముగ్గురు మృత్యువా త పడడం చర్చనీయాంశమైంది.

కరోనా కలకలం.. ఆక్సిజన్ అందక ఆగిన నలుగురి ఊపిరి.. గంటల వ్యవధిలో దారుణం..!

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నలుగురి మృతి

మృతుల్లో కరోనా బాధితులు ముగ్గురు.. ఇతర వ్యాధితో మరొకరు 

గంటల వ్యవధిలో దారుణం.. ఆక్సిజన్‌ అందకనే వరుస మరణాలు 

వైద్యులు, సిబ్బంది తీరుపై మండిపడ్డ మృతుల కుటుంబీకులు 

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన.. సర్ది చెప్పిన వైద్యులు  

ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు 


నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. గురువారం రాత్రి వేళ.. అదీ గంటల వ్యవధి లోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనాతో ముగ్గురు మృత్యువా త పడడం చర్చనీయాంశమైంది. వివరాల్లో కి వెళితే.. జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాత్రి 10.30 సమయంలో మృతిచెందారు. ఏఆర్‌ పీ క్యాంప్‌నకు చెందిన 58వృద్ధురాలు రాత్రి 12.30 ప్రాంతంలో, భీమ్‌గల్‌ మండలం పు రాణిపేటకు చెందిన వ్యక్తి అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వీరితో పాటు నందిపేటకు చెందిన మరొక వ్యక్తిని దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతుండగా తీ సుకురావడంతో ఆయన ఆసుపత్రికి వచ్చే లోపే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కరోనా రోగి కాదని తెలిపారు. కరోనాతో మృతిచెందిన ముగ్గురి మృతదేహాల ను బంధువుల అనుమతితో అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. 


ఆక్సిజన్‌ సరఫరాపై ఆరోపణలు.. 

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో సెంట్రల్‌ ఆ క్సిజన్‌ సరఫరాపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్‌ సరఫరాలో లెవల్స్‌ త గ్గడం వల్ల ఇబ్బందులు ఏర్పడినట్లు బంధువులు ఆరోపించారు. ఈ ఆసుపత్రిలో కొవి డ్‌ రోగుల కోసం 40 ఐసీయూ బెడ్‌లను ఏ ర్పాటు చేశారు. వీటితో పాటు ఐసోలేషన్‌ లో మరో 60 బెడ్‌ల వరకు ఆక్సిజన్‌ను సెం ట్రల్‌ యూనిట్‌ ద్వారానే సరఫరా చేస్తున్నా రు. హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఈ ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. లెవల్స్‌ త గ్గినప్పుడు వైద్యుల సూచనల మేరకు స్థానికంగా ఉన్న సిలిండర్ల ద్వారా లెవల్స్ ను మెయింటేన్ చేస్తారు. అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను ఒకరికి బదులు మరొకరికి అమర్చే సమయంలో రోగులకు, సిలిండర్లను అమర్చే వ్యక్తులకు మధ్య కొద్దిపాటి గొడవ జరిగి, ఈ విషయమై బయట ఉన్న బంధువులకు బాధితులు సమాచారం ఇవ్వడంతో ఆక్సిజన్ సరఫరాలో లోపాల వల్లే తమ వారు మరణించినట్లు బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఒక రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం, సరైన చికిత్స, ఆక్సిజన్ అందకనే మరణించినట్లు ఆరోపించారు. వైద్యులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసి వైద్య సేవలు అందించామని తెలిపారు. వారి వయసు ఎక్కువ కావడం, ఆస్తమా, షుగర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో తట్టుకోలేకపోయారని వారి బంధువులకు సర్దిచెప్పారు. 


ఆ ముగ్గురు కరోనాతోనే మృతిచెందారు..డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ముగ్గురు కరోనాతో మృతిచెందారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. వీరందరూ ఆసుపత్రిలో చేరినప్పుడే ఇతర జబ్బులతో కూడా బాధపడుతున్నారన్నారు. వీరికి ఇతర జబ్బులు ఉండడం, శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవడం వల్ల మృతిచెందారని ఆయన తె లిపారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కోమార్పిడ్‌ రోగులైన వీరి కి అన్ని రకాల చికిత్సలను అందించామని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు వృద్ధులు కావడం వల్ల తట్టుకోలేదన్నారు. మరొక రోగికి అస్తమాతో పాటు షుగర్‌ ఉండడం వల్ల సమస్య ము దిరిందని తెలిపారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆయన తెలిపారు. సెంట్రల్‌ ఆక్సిజన్‌ ద్వారానే రోగులందరికీ సరఫరా చేస్తున్నామని తెలిపారు. సిలిండర్‌లను అందుబాటులో ఉం చామన్నారు. ఆక్సిజన్‌ సరఫరాలో కొద్ది మేర లెవల్స్‌ తగ్గినందు కే రాత్రి వేళల్లో సిలిండర్‌లు మార్చామని తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాలో లోపం వల్ల మృతిచెందలేదని ఆయన తెలిపారు.


ఆక్సిజన్‌ అందక చనిపోలేదు..కలెక్టర్‌ నారాయణరెడ్డి

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక ఎవరూ మృతిచెందలేదని కలెక్టర్‌ తెలిపారు. వారు ముగ్గురితో పాటు మరొక వ్యక్తి కూడా ఆసుపత్రిలో చనిపోయారన్నారు. ఆయన కరోనా రోగి కాదని, ఆసుపత్రికి తీసుకవస్తున్న సమయంలోనే మృతిచెందినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అన్ని ఐసీయూ బెడ్‌లకు ఉందన్నారు. చికిత్స పొందుతన్న అం దరికీ ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారన్నారు. రాత్రి సమయంలో సిలిండర్‌ మారుస్తుండగా ఒక రోగి చూసి ఆందోళన చెందడం వల్లనే అది రూమర్‌గా మారిందని కలెక్టర్‌ తెలిపారు. అర్ధరాత్రి లో కూడా వైద్యులు ఉండి రౌండ్‌దిక్లాక్‌ సేవలు అందిస్తున్నారన్నారు. చనిపోయిన ముగ్గురు కరోనా రోగులకు గురువారం ఉ దయమే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయిందన్నారు. వారికి ఇతర జ బ్బులు కూడా ఉండడం వల్ల మృతిచెందారని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు జా గ్రత్తగా ఉండాలన్నారు. స్వీయనియంత్రణ పాటించాలన్నారు.


పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు..

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో.. శుక్రవారం భారీగా పోలీసు బందోబ స్తు ఏర్పాటు చేశారు. మృతిచెందిన కరోనా బాధితుల మృతదేహాలను గ ట్టి బందోబస్తు మధ్య తరలించారు. అదే విధంగా ఆసుపత్రి వద్ద రోగుల బంధువులు ఆందోళన నిర్వహించకు ండా కూడా పోలీసులు పకడ్బందీ చ ర్యలు చేపట్టారు. కరోనా వైరస్‌ నేప థ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆం దోళనలు, నిరసనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు స్వయం గా పర్యవేక్షించారు. బంధువుల అను మతితో మృతుల అంత్యక్రియలు స జావుగా నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 


ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన 

జిల్లాలో కరోనా కేసులతో పాటు మృతులు కూడా పెరుగుతుండడం తో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రతీరోజు కేసుల సంఖ్య ఎక్కువవుతుండడంతో.. బయటకు వచ్చేందుకే జనం జంకుతున్నారు. కరోనా సోకిన వారి కుటుంబాలతో పాటు ఇతర జ బ్బులు వచ్చిన వారు కూడా ఆందోళనతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతం లో కొంత మందికే వ్యాప్తిచెందినా.. ప్రస్తుతం అన్ని ప్రాంతాల వారికి వ స్తుండడంతో కరోనా లక్షణాలు ఉన్న వారు ఆసుపత్రులకు వెళుతున్నారు. జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని కా ర్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లాలో ప్ర జాప్రతినిధులతో పాటు ఉద్యోగులు, సామాన్య ప్రజల్లోనూ కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే జిల్లాలో ఇద్ద రు ఎమ్మెల్యేలు, ఒక జడ్పీటీసీ, ఒక కార్పొరేటర్‌తో పాటు ఇతరులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.


ఎమ్మెల్యేలు కరోనా తగ్గి ప్రస్తుతం ఇళ్లల్లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. జడ్పీటీసీ, కా ర్పొరేటర్‌ చికిత్స పొందుతున్నారు. జి ల్లా పోలీసు శాఖలో ఓ సీఐ, ఓ ఎ స్సై, ఏఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరందరూ ఆసుపత్రుల్లో చేరారు. వీరి ప్రైమరీ కాంటాక్టులను కూడా హోంక్వారంటైన్‌లో ఉంచారు. వైద్య ఆరోగ్య శాఖలో వా రికి కూడా ఇద్దరు వైద్యులతో పాటు మిగతా సిబ్బందిలో ఇద్దరికి రావడం తో వారిని కూడా విధుల నుంచి త ప్పించారు. వారు చికిత్స పొందుతు ండగా వారి ప్రైమరీ, సెకండరీ కాం టాక్టులను హోంక్వారంటైన్‌లో ఉం చారు. అలాగే ప్రైవేట్‌, ఇతర వృత్తు ల్లో చేస్తున్న వారికి కూడా ఈ కరో నా సోకింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఒకేసారి పెరగడంతో అంద రూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కట్టడి చేస్తే తప్పా.. ప్రస్తుత కరోనా ప్రభావం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. 

Updated Date - 2020-07-11T19:53:54+05:30 IST