ఆ నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌ను కుమ్మేస్తున్నాయ్‌!

ABN , First Publish Date - 2021-01-23T05:46:23+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నాలుగు కంపెనీలే మార్కెట్‌ను శాసిస్తున్నాయట. భారతదేశంలోని మొబైల్‌ అమ్మకాల్లో 95 శాతం శాంసంగ్‌, ఒప్పో, షావోమీ,

ఆ నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌ను కుమ్మేస్తున్నాయ్‌!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నాలుగు కంపెనీలే మార్కెట్‌ను శాసిస్తున్నాయట. భారతదేశంలోని మొబైల్‌ అమ్మకాల్లో 95 శాతం శాంసంగ్‌, ఒప్పో, షావోమీ, వివో బ్రాండ్లవేనని కెనాలిస్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ తెలిపారు. కరోనా విజృంభించిన్పటికీ మొబైల్‌ అమ్మకాలు జోరుతగ్గలేదు. గత ఏడాది మూడో క్వార్టర్లో మార్కెట్లో వీటి వాటా 93.6 శాతం. అంతకుముందు ఏడాది 90.2 శాతం మాత్రమే కావడం గమనార్హం. 


కొనుగోలుదారులు తమ ఫోన్ల ఎంపికలో హార్డ్‌వేర్‌, ఫోల్డబుల్‌ స్ర్కీన్స్‌, రివర్సబుల్‌ కెమెరాస్‌, ఎక్స్‌పాండబుల్‌ ఫోన్స్‌కు మాత్రమే ప్రాధాన్యం వహిస్తున్నారట. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా యుఐ, కంప్యుటేషనల్‌ ఫొటోగ్రఫీ, లోకలైజేషన్‌, వినియోగదారుడి అనుభవం చుట్టూనే తన ఆర్‌ అండ్‌ డి నిధులు ఖర్చుపెడుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వస్తున్న ఫోన్లలో సగం 5జిని సపోర్ట్‌ చేస్తున్నాయి. అయితే పదివేల లోపు మొత్తానికి ఆ ఫోన్లు అందించడం కష్టమేనని కెనాలిస్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-01-23T05:46:23+05:30 IST