Abn logo
Jun 17 2021 @ 12:16PM

షెల్టర్ హోంలోని మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు...నలుగురి అరెస్ట్

జంషెడ్ పూర్ (జార్ఖండ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాకు చెందిన మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నలుగురు నిందితులను పోలీసులు జంషెడ్ పూర్ వద్ద అరెస్ట్ చేశారు.సింగ్రౌలీ జిల్లా షెల్టర్ హోం మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్టు మేనేజరు హర్పాల్ సింగ్,అతని భార్య పుష్ప టిర్కీ, వార్డెన్ గీతాదేవి, మరొకరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో నిందితులని ఎస్పీ సుభాష్ చంద్ర చెప్పారు. జంషెడ్ పూర్ పట్టణంలోని టెల్కో షెల్టరు హోంలో ఉన్న బాలికలు తమపై అత్యాచారం చేయడంతోపాటు లైంగికంగా వేధించారని ఫిర్యాదు  చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. షెల్టరు హోంలోని ఇదదరు మైనర్ బాలికలు అదృశ్యమవడంతో వారి కోసం గాలిస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...