Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 27 2021 @ 13:22PM

వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ : ఆభరణాల ప్రియులకు శుభవార్త! బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం కన్నా మంగళవారం రూ.140 తగ్గింది. సోమవారం 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.44,590 ఉండేది, మంగళవారం ఇది రూ.44,450కి తగ్గింది. 24 క్యారట్ల బంగారం ధర కూడా సోమవారం కన్నా మంగళవారానికి రూ.190 తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.48,460 ఉండేది, మంగళవారం ఇది రూ.48,650కి తగ్గింది. ఈ ధరల్లో జీఎస్‌టీ, టీసీఎస్ వంటి పన్నులను కలపలేదని గమనించాలి. 


మల్టీ కమోడిటీ ఎక్స్ఛేందజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 0.09 శాతం తగ్గింది. అంటే 10 గ్రాములకు రూ.42 తగ్గి రూ.47,420కి ట్రేడ్ అయింది. అంతకుముందు రోజు క్లోజింగ్ ధర రూ.47,462. గత వారం ఎంసీఎక్స్ గోల్డ్ రెండు నెలల గరిష్ఠ స్థాయికి అంటే రూ.48,400కు చేరింది. 


బంగారం ధరలపై అనేక అంతర్జాతీయ అంశాల ప్రభావం ఉంటుంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పులు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో మార్పులు, ఆభరణాల మార్కెట్లు వంటివాటి ప్రభావం ఉంటుంది. అమెరికన్ ఫెడ్ రిజర్వు పాలసీ సమీక్ష బుధవారం జరుగుతుంది. అయితే అమెరికాలో వడ్డీ రేట్లపై దీని ప్రభావం పెద్దగా ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. 
Advertisement
Advertisement