మూడు రోజులు... రూ. 17 వేల కోట్లు... ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు

ABN , First Publish Date - 2022-03-06T22:31:59+05:30 IST

ఎఫ్‌పీఐ(ఫారిన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్)లు... భారతీయ మార్కెట్ల నుండి మార్చి నెల మొదటి మూడు రోజుల్లోనే రూ. 17 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు.

మూడు రోజులు... రూ. 17 వేల కోట్లు... ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు

న్యూఢిల్లీ : ఎఫ్‌పీఐ(ఫారిన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్)లు... భారతీయ మార్కెట్ల నుండి మార్చి నెల మొదటి మూడు రోజుల్లోనే రూ. 17 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా మేరకు...  ఎఫ్‌పీఐలు) మార్చి 2-4 తేదీల మధ్య... ఈక్విటీల నుండి రూ. 14,721 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుండి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను  ఉపసంహరించుకున్నారు.  రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో... రుణ విభాగంలో ఎఫ్‌పీఐలు అమ్మకందారులుగా ఉంటూ వస్తున్నారు.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో... చోటుచేసుకున్న అనిశ్చితి, ముడిచమురు ధరల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో మార్చిలో కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే... విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ల నుండి రూ. 17,537 కోట్ల వరకు ఉపసంహరించుకున్నారు.


డిపాజిటరీల డేటా ప్రకారం మార్చి 2-4 మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈక్విటీల నుంచి రూ. 14,721 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుంచి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుంచి రూ. 9 కోట్లను  ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో...  మొత్తం నికర అవుట్‌ఫ్లో రూ. 17,537 కోట్లకు చేరుకుంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకకే  విజయకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఏర్పడిన అనిశ్చితి... ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్‌‌ను ప్రభావితం చేశాయి’ అని పేర్కొన్నారు. మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ ప్రకారం... విదేశీ ప్రవాహాలకు సంబంధించి భారత్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు అటువంటి పరిమాణంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మంచివి కావు. భారతీయ ఈక్విటీ మార్కెట్ల అధిక వాల్యుయేషన్లు, కార్పొరేట్ ఆదాయాలకు రిస్క్, ఆర్థికవృద్ధి మందగించడం తదితర పరిస్థితుల్లో... విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకుండా వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-06T22:31:59+05:30 IST