కొవిషీల్డ్ తీసుకున్నవారికి ఫ్రాన్స్ తీపి కబురు

ABN , First Publish Date - 2021-07-19T02:04:00+05:30 IST

ఫ్రాన్స్ ప్రభుత్వం భారత ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు స్వేచ్ఛగా తమ దేశంలోకి రావొచ్చని ప్రకటించింది. ఈ టీకా తీసుకున్న వారికి క్వారెంటైన్ నిబంధనలు వర్తించవని

కొవిషీల్డ్ తీసుకున్నవారికి ఫ్రాన్స్ తీపి కబురు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ ప్రభుత్వం భారత ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు స్వేచ్ఛగా తమ దేశంలోకి రావొచ్చని ప్రకటించింది. ఈ టీకా తీసుకున్న వారికి క్వారెంటైన్ నిబంధనలు వర్తించవని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్‌ల్యాండ్, జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఇప్పటికే కొవిషీల్డ్‌కు ఆమోదం తెలుపగా తాజాగా ఈ జాబితాలోకి ఫ్రాన్స్ కూడా వచ్చి చేరింది. కాగా.. ఫ్రాన్స్ ప్రకటనపట్ల సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండగియా సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-07-19T02:04:00+05:30 IST