వచ్చే నెల నుంచి నైట్ క్లబ్బులు షురూ.. అనుమతిచ్చే యోచనలో ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-06-18T05:12:52+05:30 IST

కరోనా కారణంగా గతేడాది నుంచి అధికశాతం నైట్ క్లబ్బులు మూతపడే ఉన్నాయి. అయితే వీటిని వచ్చే నెల నుంచి తెరుచుకునేందుకు అనుమతించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం యోచిస్తోంది.

వచ్చే నెల నుంచి నైట్ క్లబ్బులు షురూ.. అనుమతిచ్చే యోచనలో ప్రభుత్వం!

ప్యారిస్: కరోనా కారణంగా గతేడాది నుంచి అధికశాతం నైట్ క్లబ్బులు మూతపడే ఉన్నాయి. అయితే వీటిని వచ్చే నెల నుంచి తెరుచుకునేందుకు అనుమతించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా తీవ్రత తీవ్రంగా పడిన యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరగడంతో ఇక్కడ ప్రస్తుతం కరోనా చాలా వరకూ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలోనే గతేడాది మార్చి నుంచి దేశంలో మూతపడి ఉన్న నైట్ క్లబ్బులు తెరుచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి ఆలివర్ వెరాన్ తెలిపారు. తాజాగా ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాల్సిన నిబందనలను కూడా తొలగించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, స్టేడియాలు వంటి ప్రజలు గుంపుగూడే ప్రదేశాల్లో మాస్కు పెట్టుకుంటే చాలని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆదివారం నుంచి నైట్ కర్ఫ్యూ కూడా దాదాపు దేశవ్యాప్తంగా తొలగించనున్నట్లు వెల్లడించింది.

Updated Date - 2021-06-18T05:12:52+05:30 IST