కొవిడ్ యాప్‌లతో జర జాగ్రత్త..సైబర్ మోసాలపై సీబీఐ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-05-20T10:49:54+05:30 IST

కొవిడ్ యాప్ ద్వార మీ ఫోన్ లో డేటాను దొంగిలించి మీ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించే అవకాశముందని సీబీఐ ప్రజలను హెచ్చరించింది....

కొవిడ్ యాప్‌లతో జర జాగ్రత్త..సైబర్ మోసాలపై సీబీఐ హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న కష్టకాలంలో కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు తెర లేపారు.కొవిడ్ హెచ్చరిక యాప్‌లలో మాలవేర్ ల గురించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రజలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కొవిడ్ యాప్ ద్వార మీ ఫోన్ లో డేటాను దొంగిలించి మీ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించే అవకాశముందని సీబీఐ ప్రజలను హెచ్చరించింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబర్లు, ఆర్థిక లావాదేవీల డేటాను దొంగిలించి సైబర్ దొంగలు మీ ఖాతాలోని డబ్బును డ్రా చేస్తారని సీబీఐ హెచ్చరించింది. సెర్బెరస్ అనే బ్యాంకింగ్ ట్రోజన్ సంబంధించి హానికరమైన సాఫ్ట్ వేర్ లింక్ ను డౌన్ లౌడ్ చేయడానికి కొవిడ్ యాప్ ను ఎరగా ఉపయోగిస్తుందని, హానికరమైన ఈ యాప్‌ను ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సీబీఐ కోరింది. 

Updated Date - 2020-05-20T10:49:54+05:30 IST