Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉమ్మడి ఆస్తి రిజిస్ట్రేషన్‌లో మోసం

కౌన్సిలర్‌పై బంధువుల ఫిర్యాదు 

భువనగిరి రూరల్‌, డిసెంబరు 2:  ఉమ్మడి ఆస్తిని భువనగిరి 11వ వార్డు కౌన్సిలర్‌ జిట్టా  వేణుగోపాల్‌రెడ్డి  అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించు కున్నారని ఆయన బంధువులు భువనగిరి ఏసీపీకి గురువారం ఫిర్యాదు చేశారు. జిట్టా సంజీవరెడ్డి, బాల్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, బల్వం త్‌రెడ్డి, భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బొమ్మాయిపల్లి గ్రామ పరిధిలోని ఉమ్మడిగా 15 ఎకరాల భూమి ఉంద న్నారు. ఈ భూమిని అందరికీ సమానంగా పంచుతామనని సమీప బంధువైన  కౌన్సిలర్‌ వేణుగోపాల్‌రెడ్డి నమ్మబలికి తహసీల్దార్‌ కార్యాల యంలో తమతో సంతకాలు చేయించారన్నారు. డాక్యుమెంట్‌ వచ్చిన తర్వాత మొత్తం భూమిని ధరణి వెబ్‌సైట్‌లో వేణుగోపాల్‌రెడ్డి రిజిస్ట్రేషన్‌ చేయిం చుకున్నట్లు గుర్తించామన్నారు. వేణుగోపాల్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. Advertisement
Advertisement