ఇన్‌స్టాగ్రాంలో నయా మోసం.. అమ్మాయిల పేర్లతో ఘరానా దందా

ABN , First Publish Date - 2021-03-06T01:06:02+05:30 IST

సోషలో మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలతో అడ్డంగా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఫేస్‌బుక్‌లో జరిగే చీటింగ్‌లు ఇప్పుడు ఇస్టాగ్రమ్‌లోనూ మొదలయ్యాయి. అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. ..

ఇన్‌స్టాగ్రాంలో నయా మోసం.. అమ్మాయిల పేర్లతో ఘరానా దందా

ఇంటర్నెట్ డెస్క్: సోషలో మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలతో అడ్డంగా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఫేస్‌బుక్‌లో జరిగే చీటింగ్‌లు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్‌లోనూ మొదలయ్యాయి. ఇలాంటి ఓ మోసగాళ్ల గుట్టును ఏబీఎన్ క్రైం బ్యూరో బయటపెట్టింది. అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్స్ అంటూ తీపికబుర్లు చెబుతారు. ఆ తరువాత నెమ్మదిగా తానో సమస్యలో ఉన్నానని, కాలేజ్ ఫీజ్ కట్టాలని, అందుకు కొంత డబ్బు కావాలని ప్రాధేయపడతారు. ప్రూఫ్ కోసం తమ కాలేజీ ఐడీ కార్డు కూడా పంపుతారు. మనం ఇచ్చేందుకు ఇష్టపడలేదనుకోండి.. అవసరమైతే నీతో గడుపుతానంటూ షాకింగ్ మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ చూడగానే టెంప్ట్ అయ్యారంటే అంతే. అడుగుతోంది చిన్న మొత్తమే కదా.. అందులోనూ అమ్మాయి.. అని జారామో.. వాళ్ల ప్లాన్ సక్సెస్ అయినట్లే. కట్ చేస్తే కహాని మహా రంజుగా సాగుతుంది. 


ఇన్‌స్టాగ్రాంలో ఎవరి ప్రొఫైల్ అయినా చూడవచ్చు. ఎవరు ఎవరికైనా మెసేజ్ పెట్టవచ్చు. ప్రొఫైల్ పిక్ బాగుంది కదా అని ‘హాయ్’ మెసేజ్ పెట్టాగానే వెంటనే రెప్ప్లై వచ్చింది. ‘హౌఆర్ యూ’ అని పలకరించింది. చాటింగ్‌లో పరిచయం పెంచుకుని.. ‘మీ ప్రొఫైల్ పిక్ బాగుంది’ అని బిస్కట్ విసిరింది. ఆ తర్వాత ‘ఎం చేస్తున్నావ్..?’ అని అడిగింది. ‘జాబ్ చేస్తున్నా’నని రిప్లై ఇవ్వగానే.. ‘మనం ఫ్రెండ్స్’ అంటూ ఓక స్వీట్ మెసేజ్ పంపింది. అందమైన అమ్మాయి కదా.. అందులోనూ ఫ్రెండ్స్ అని పెట్టింది. అంతే.. ‘చిన్న హెల్ప్ చేస్తావా..?’ అని అడిగింది. ఏంటని అడిగితే.. ‘కాలేజ్ ఫీజ్ కట్టాలి.. ఓ రూ.2500 పంపుతావా..?’ అని రిక్వెస్ట్ వచ్చింది. దీనికి తన కాలేజ్ ఐడి కార్డు కూడా ప్రూఫ్ పంపింది. అయితే నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగితే మాత్రం మాట దాటవేసింది. ‘మీ నెంబర్’ ఇవ్వండి అని అడిగింది. నెంబర్ ఇవ్వగానే వెంటనే కాల్ వచ్చింది. 


ఫోన్‌లో ఓ అందమైన వాయిస్ హాయ్ అని పలకరించి.. తన సమస్య చెప్పి డబ్బులు అడిగింది. అది కూడా మరో 20 నిముషాల్లో ఫీజ్ కట్టాలని, అది దాటితే కట్టలేనని చెప్పింది. మరో అక్కడ ట్విస్ట్. సాయంత్రానికల్లా తనకు రూ.45 వేలు స్కాలర్ షిప్ వస్తుందని, కావాలంటే మా లెక్చరర్‌తో మాట్లాడమని పక్కన మరో వ్యక్తితో మాట్లాడించింది. ఆ వ్యక్తి కూడా అవుననే చెప్పి.. కుదిరితే సాయం చేయమని కోరాడు. ఇంతలో మళ్లీ అమ్మాయి ఫోన్ తీసుకుని స్కాలర్‌షిప్ రాగానే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఎంతో దీనంగా చెప్పింది. ఇక చివరికి ‘డబ్బులు పంపి ఈ ఒక్క అవసరం తీర్చితే మీతో గడుపుతాన’ని కూడా మెసేజ్ పెట్టింది. ఆ మాటతో అంతా షాక్. ఇలాంటి వారికి ఆలోచించకుండా డబ్బు పంపించారో వాళ్ల ప్లాన్ సక్సెస్ అయినట్లే. ఇక ఆ నెంబర్ పనిచేయదు. డబ్బులు పోయినట్లే. 


సదరు ఫ్రాడ్‌ గ్యాంగ్ ఇన్‌స్టాలో చేసిన చాటింగ్‌కు సంబంధించిన ఈ స్క్రీన్ షాట్లు చూడండి. ఇలా అమ్మాయిల పేర్లతో, అందమైన ఫోటోలతో అబ్బాయిలను ట్రాప్ చేస్తున్న ఓ ఇన్‌స్టా అకౌంట్ ఏబీఎన్ క్రైం బ్యూరో చేతికి చిక్కింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-03-06T01:06:02+05:30 IST