క్రెడిట్‌ కార్డు పేరుతో లక్ష రూపాయలు స్వాహా

ABN , First Publish Date - 2021-04-18T16:23:49+05:30 IST

క్రెడిల్‌ కార్డు గడువు తీరుతోందని, కొత్త కార్డు ఇస్తామంటూ

క్రెడిట్‌ కార్డు పేరుతో లక్ష రూపాయలు స్వాహా

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : క్రెడిల్‌ కార్డు గడువు తీరుతోందని, కొత్త కార్డు ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు సుమారు రూ.లక్ష కాజేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ క్యాంప్‌సలో నివసించే ఎల్‌.శ్రీనివాస రావు సీజీజీ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఈ నెల 10న ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. క్రెడిట్‌ కార్డు గడువు తీరుతుందని, కొత్త కార్డు కోసం ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలని కోరాడు. శ్రీనివాసరావు రెండు ఓటీపీలను ఆగంతుకులకు చెప్పాడు. కొద్ది నిమిషాల్లోనే ఢిల్లీలోని మ్యాజిక్‌ బ్రిక్స్‌ పేరిట రూ.49.490 చొప్పున రెండుసార్లు డబ్బు డ్రా అయినట్టు సమాచారం  వచ్చింది. వెంటనే ఆయన అప్రమత్తమై క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ చేసి, జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-18T16:23:49+05:30 IST