కొవిడ్ రోగుల కోసం ఉచిత అంబులెన్స్‌లు ప్రారంభించిన ఉత్తమ్

ABN , First Publish Date - 2021-05-23T21:10:02+05:30 IST

కొవిడ్ రోగుల కోసం ఉచిత అంబులెన్స్‌లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా

కొవిడ్ రోగుల కోసం ఉచిత అంబులెన్స్‌లు ప్రారంభించిన ఉత్తమ్

హైదరాబాద్: కొవిడ్ రోగుల కోసం ఉచిత అంబులెన్స్‌లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలుంటాయని, కరోనా బాధితులను సమీప ఆస్పత్రులకు చేరుస్తామని  తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ అంబులెన్స్‌లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రైవేట్ అంబులెన్స్‌లపై ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ధరలను నియంత్రించాలని కోరామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం లేదని చెప్పారు. ఇతరు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అలా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2021-05-23T21:10:02+05:30 IST