ఉచిత కరోనా టెస్టులు.. సుప్రీం తీర్పుతో లాభమా నష్టమా?

ABN , First Publish Date - 2020-04-10T01:28:31+05:30 IST

కరోనా కట్టడి కోసం వ్యాధి నిర్ధారణ పరీక్షల ఉచితంగా చేయాలంటూ సర్వోన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉచిత కరోనా టెస్టులు.. సుప్రీం తీర్పుతో లాభమా నష్టమా?

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం వ్యాధి నిర్ధారణ పరీక్షల ఉచితంగా చేయాలంటూ సర్వోన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఈ తీర్పు వల్ల పరీక్షల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యాపారవేత్తలు, వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంస్థలపై ఇది ఆర్థికంగా ఒత్తడి పెంచుతుందని చెబుతున్నారు. సుప్రీం తీర్పుపై తాజాగా బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘మానవత్వం మంచిదే కానీ కొన్ని పరిస్థితుల్లో ఆచరసాధ్యం కాకపోవచ్చు. దీని వల్ల పరీక్షల సంఖ్య తగ్గువచ్చు. చిన్న చిన్న సంస్థలు ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. కొంత మొత్తానికి అవి తమ సేవలను అందిస్తున్నాయే కానీ లాభాలు మూటగట్టుకోవట్లేదు. ఈ పరస్థితుల్లో ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వగలవా? అంటూ ఆమె ట్విటర్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2020-04-10T01:28:31+05:30 IST