Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

ఆమనగల్లు: గ్రామీణపేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం రూ.3.50 లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా సీఎం సహాయనిధి ద్వారా పేదలకు ఆరోగ్య చికిత్సలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, తోట గిరియాదవ్‌, దశరథ్‌ నాయక్‌, గంప వెంకటేశ్‌, గూడూరు లక్ష్మీనర్సింహ, బాలయ్య, నిట్ట నారాయణ, జోగు వీరయ్య, పత్యనాయక్‌, ప్రశాంత్‌ నాయక్‌, కృష్ణయ్య యాదవ్‌, తులసీరామ్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement