UAEలోని ఆ నగరంలో వినూత్న ప్రయోగం.. నిరుపేదలకు ఉచితంగా Petrol, Diesel

ABN , First Publish Date - 2021-08-24T20:12:41+05:30 IST

యూఏఈలోని అజ్మాన్ నగరం ఓ వినూత్న ప్రయోగం చేయబోతోంది. నగరంలోని నిరుపేదలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఇంధనాన్ని హోం డెలివరీ చేసే, కారు సర్వీస్ కంపెనీ అయిన సీఏఎఫ్‌యూ మందుకొచ్చింది.

UAEలోని ఆ నగరంలో వినూత్న ప్రయోగం.. నిరుపేదలకు ఉచితంగా Petrol, Diesel

అజ్మాన్: యూఏఈలోని అజ్మాన్ నగరం ఓ వినూత్న ప్రయోగం చేయబోతోంది. నగరంలోని నిరుపేదలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఇంధనాన్ని హోం డెలివరీ చేసే, కారు సర్వీస్ కంపెనీ అయిన సీఏఎఫ్‌యూ మందుకొచ్చింది. అల్ ఇహ్సాన్ ఛారిటీ అసోసియేషన్ భాగస్వామ్యంతో సీఏఎఫ్‌యూ అజ్మాన్‌లోని అల్పాదాయ కుటుంబాలు, వ్యక్తులకు ఇలా ఉచితంగా ఇంధనం ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఈ వినూత్న ప్రయోగం కోసం సీఏఎఫ్‌యూ ట్రయల్స్ కూడా నిర్వహించింది. దీనిలో భాగంగా ఇటీవల సీఏఎఫ్‌యూ ఎనిమిది ఇంధన ట్రక్కులతో రెండు రోజులలో అజ్మాన్‌లోని 100 కుటుంబాలకు ఉచిత ఇంధనాన్ని అందించింది. 


ఈ సందర్భంగా సీఏఎఫ్‌యూ వ్యవస్థాపకుడు, సీఈఓ రషీద్ అబ్దుల్లా అహ్మద్ అల్ ఘురైర్ మాట్లాడుతూ.. అవసరమైన వారికి సహాయపడటానికి తమ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని, దీనికి ఇహ్సాన్ స్వచ్ఛంద సంస్థ సహకరించడం గర్వంగా ఉందని అన్నారు. అల్పాదాయ ఫ్యామిలీలకు సీఏఎఫ్‌యూ చేస్తున్న ఈ సర్వీస్ అమోఘమని ఇహ్సాన్ ఛారిటీ సీఈఓ షేక్ డా. అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ రషీద్ అల్ నవమీ చెప్పారు. దీనిలో ఇహ్సాన్ సంస్థను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఇప్పటికే దుబాయ్ హెల్త్ అథారిటీ (డీహెచ్ఏ) సహకారంతో ఫ్రంట్‌లైన్ కార్మికులకు కూడా సీఏఎఫ్‌యూ ఉచిత ఇంధనాన్ని అందిస్తోంది.  

Updated Date - 2021-08-24T20:12:41+05:30 IST