గుండెజబ్బు బాధితుల కోసం ఉచిత హెల్ప్‌ లైన్‌

ABN , First Publish Date - 2021-07-01T15:33:52+05:30 IST

గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి సేవలందించేందుకు కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ ఉచిత హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10లోని..

గుండెజబ్బు బాధితుల కోసం ఉచిత హెల్ప్‌ లైన్‌

అందుబాటులోకి తెచ్చిన కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ


బంజారాహిల్స్‌(ఆంద్రజ్యోతి): గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి సేవలందించేందుకు కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ ఉచిత హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10లోని కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ నరసరాజు, కార్యదర్శి డాక్టర్‌ రవికాంత్‌ వివరాలను వెల్లడించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హృద్రోగంతో బాధపడుతున్న వారు టోల్‌ ఫ్రీ నెం. 18005993098కు ఫోన్‌ చేస్తే వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు.


ఈ హెల్స్‌ లైన్‌ కేవలం సూచనలు అందించడానికే మాత్రమేనని వారు స్పష్టం చేశారు. కొవిడ్‌ రెండో దశలో గుండె సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 25 శాతం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో హెల్స్‌ లైన్‌ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా జబ్బులపై అధ్యయనం చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో సంస్థకు చెందిన వైద్యులు డాక్టర్‌ సాధిక్‌, ముఖే్‌షరావు, ఎ.గురుప్రకాశ్‌, డాక్టర్‌ శ్రీఽధర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, రాజీవ్‌ ఘర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-01T15:33:52+05:30 IST