మైనారిటీ బాలుర వసతి గృహాలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-01-24T06:19:32+05:30 IST

మైనారిటీ బాలుర వసతి గృహాలను సద్వినియోగం చేసుకోండి

మైనారిటీ బాలుర వసతి గృహాలను సద్వినియోగం చేసుకోండి

పాయకాపురం, జనవరి 23 : పేద మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రియాజ్‌ సుల్తానా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రీ మెట్రిక్‌ మైనారిటీ బాలుర వసతి గృహంలో 6 నుంచి 10వ తరగతి చదివే వందమంది మైనారిటీ విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ మైనారిటీ బాలుర వసతి గృహంలో, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, బీఈడీ, టీటీసీ కోర్సులు చదివే 50 మంది మైనారిటీ విద్యార్థులకు వసతి గృహాల్లో ప్రవేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి సదుపాయాల్ని కల్పిస్తామని వివరించారు. ప్రీ మెట్రిక్‌ మైనారిటీ వసతి గృహంలో ప్రవేశానికి ఏదైనా మైనారిటీ వర్గానికి చెందినవారై ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలని, పోస్ట్‌ మెట్రిక్‌ మైనారిటీ బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలని, తెల్లరేషన్‌ కార్డుదారులై ఉండాలని తెలిపారు. వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయం, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్‌, విజయవాడలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-01-24T06:19:32+05:30 IST