ఇంటి వద్ద నుంచే ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు

ABN , First Publish Date - 2021-01-21T04:12:52+05:30 IST

కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా సీఎస్‌సీ, మీ సేవ కేంద్రం నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి టెలి లా సర్వీస్‌ను ప్రారంభించారు.

ఇంటి వద్ద నుంచే ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 20: కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా సీఎస్‌సీ, మీ సేవ కేంద్రం నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి టెలి లా సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు న్యాయపరమైన సదుపాయాలు వారి ఇంటి వద్ద నుంచే, ప్రతి ఊరిలో సీఎస్‌సీ సెంటర్‌ ద్వారా ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని, ధరణి సేవల గురించి మీ సేవ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా పెండింగ్‌ మ్యుటేషన్‌లు, పట్టాలో ఆధార్‌ సమస్యలు, నలా కన్వర్షన్‌, ప్రవాస భారతీయులకు పట్టాపాస్‌బుక్‌ రిజిస్ర్టేషన్‌లు తదితర ధరణి సర్వీసెస్‌లపై సూచించారు. అప్లికేషన్‌లు చేసేటప్పుడు సరైన డాక్యుమెంట్స్‌ స్కాన్‌ చేయాలని అదనపు చార్జీలు వసూలు చేయరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ సూపరింటెండెంట్‌ నలందప్రియ, మీ సేవ ఈడీఎం బండిరవి, జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌, సీఎస్‌సీ జిల్లా మేనేజర్‌ కామెరి రాహుల్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ లంక కిరణ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-01-21T04:12:52+05:30 IST