Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత రేషన్‌

అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత రేషన్‌ ఇవ్వాలని రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వనున్నారు. 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు.. బంగాళాదుంపలు, లీటర్‌ పామాయిల్‌ ఇవ్వనున్నారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడటంతో చేతికందిన పంట ఏటి పాలైంది. వరద సృష్టించిన విలయం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేకపోతున్నారు.

Advertisement
Advertisement