Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్చి వరకు ఉచిత రేషన్‌ బియ్యం

- నాలుగు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
- జిల్లాలో 4,70,290 మంది లబ్ధిదారులకు ప్రయోజనం

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 30: ఉచిత రేషన్‌ బియ్యం పథకాన్ని మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర కెబినెట్‌ ఇటీవల నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై) పథకం కింద పేదలకు రేషన్‌బియ్యాన్ని నాలుగు నెలల పాటు ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిసెంబరు 2021 నుంచి మార్చి 2022 వరకు ఉచిత బియ్యం అందజేస్తారు. ఈ మేరకు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అయిదు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తారు. కరోనా ప్రభావంతో దేశంలో ఎక్కువ శాతం పేదలు ఉపాధిని కోల్పోయారు. వారిని దృష్టిలో ఉంచు కొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

జిల్లాలో  278 రేషన్‌ దుకాణాలు..
జిల్లాలో 278 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 1,40,417 కార్డులు ఉన్నాయి. ఇందులో సాధారణ కార్డులు 1,27,372, అంత్యోదయ కార్డులు 13,024, అన్నపూర్ణ కార్డులు 21 ఉన్నాయి. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యా ణ్‌ అన్న యోజన పథకం ద్వారా 4,70,290 మంది లబ్ధిదారులకు ప్రయో జనం చేకూరుతుంది. నవంబరుతో ఉచిత బియ్యం పథకం పంపిణీ ముగియనుండడంతో కేంద్ర కేబినెట్‌ మరో నాలుగు నెలల పాటు పెం చుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసినా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. నాలుగు నెలలకు సంబంధించి బియ్యం అలాట్‌మెంట్‌ రావాల్సి ఉంది.  

మార్చి వరకు ఉచిత బియ్యం..
- స్వామికుమార్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ అన్నయోజన పథకాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నాలుగు మాసాల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తాం. ఒక్కొక్కరికి అయిదు కిలోల చొప్పున పంపిణీ చేస్తాం. జిల్లాలో 278 రేషన్‌ షాపులు ఉన్నాయి. ఈ పథకం ద్వారా 4.5 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రయోజనాన్ని పొం దనున్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి.

Advertisement
Advertisement