నాడు ఉచితం.. నేడు విక్రయం

ABN , First Publish Date - 2021-07-30T06:01:32+05:30 IST

తెలుగుదేశం హయాంలో జింక్‌, జిప్సం తదితర ప్రధానమైన సూక్ష్మపోషకాల ఎరువులను రైతులకు ఉచితంగా అందజేశారు.

నాడు ఉచితం.. నేడు విక్రయం
లేపాక్షి ఆర్బీకే కేంద్రం

జింక్‌, జిప్సం కొనాల్సిందే

రాయితీపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

అయోమయంలో రైతులు

లేపాక్షి, జూలై 29 : తెలుగుదేశం హయాంలో జింక్‌, జిప్సం తదితర ప్రధానమైన సూక్ష్మపోషకాల ఎరువులను రైతులకు ఉచితంగా అందజేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం  రైతులకు ఆర్‌బీకే ద్వారా విక్రయిస్తూ ఆర్థిక భారం మోపుతోంది. ప్రస్తుతం జిప్సం, జింక్‌ ఎరువుల కోసం రైతులు ముందుగానే బ్యాంక్‌లో డీడీలు తీయాలి. ఇందులో పూర్తీ ధర చెల్లించాలి. రాయితీని ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. డీడీ తీసిన రసీదును ఆర్‌బీకేలో అందజేయాలి. వారం తరువాత రైతుకు ఆ ఎరువులను అందజేస్తారు. ప్రస్తుతం కిలో జిప్సం రూ.3.50, జింక్‌ ధర రూ రూ.53 ఉంది. ఈ ప్రకారం రైతులు బ్యాంకుల్లో ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం రాయితీ ఎంత ఇస్తుందో తెలీక.. రైతులు అయోమయంలో పడ్డారు. తప్పనిసరిగా ఎరువులు వాడాలని వ్యవసాయాధికారులు చెబుతుండటంతో  రైతులు అప్పులు చేసి ఎరువులు కొనే పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలో ఆర్థిక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా మరింత ఆర్థిక భారం మోపుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.


Updated Date - 2021-07-30T06:01:32+05:30 IST