గాలికుంటుకు ఉచిత టీకాలు

ABN , First Publish Date - 2021-06-20T04:54:46+05:30 IST

పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయడం జరుగుతోందని పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీ.ఎల్‌.సత్యప్రకాశ్‌ తెలిపారు.

గాలికుంటుకు ఉచిత టీకాలు
మాట్లాడుతున్న పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డీఎల్‌ సత్యప్రకాష్‌

 పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీఎల్‌ సత్యప్రకాశ్‌

సిద్దవటం, జూన్‌19 : పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయడం జరుగుతోందని పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీ.ఎల్‌.సత్యప్రకాశ్‌ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం పశువైద్యశాలలో శనివారం పశువులకు ఉచిత టీకాలు కార్యక్రమాన్ని ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా పశువులకు గాలి కుంటు వ్యాధి గాలి ద్వారా సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దాని నివారణకు ముందస్తుగా ఉచిత టీకాలను వేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను భద్రపరిచామన్నారు. జిల్లాలో సుమారు 5.61లక్షల పశువులకు 90శాతం వ్యాక్సిన్‌ వేయ డం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు పశువులకు ఉచిత టీకాలు వేస్తామన్నారు.   అలాగే గొర్రెలకు నట్టల నివారణ మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డిప్యూటీ డైరెక్టర్‌ సురే్‌షరాజు, సిద్దవటం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ సుబ్బరాయుడు, ల్యాబ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు శ్వేత, లీలా స్వర్ణ, మాధవ్‌రెడ్డి, ఎర్రపురెడ్డి, పశు వైద్య సిబ్బంది ఓబులేసు, యాకుబ్‌బాషా, జిలానీబాషా, ఖాజా, కృష్ణ, భరత్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:54:46+05:30 IST