ఆ బుజ్జి కుక్కలే వారి టార్గెట్.. అమెరికాలో పెరుగుతున్న చోరీలు.. అడ్డొచ్చిన వారిపై దాడులు..!

ABN , First Publish Date - 2022-01-18T02:26:50+05:30 IST

ఆ బుజ్జి కుక్కల కోసం అమెరికాలో పెరుగుతున్న దొంగతనాలు..!

ఆ బుజ్జి కుక్కలే వారి టార్గెట్.. అమెరికాలో పెరుగుతున్న చోరీలు.. అడ్డొచ్చిన వారిపై దాడులు..!

ఇంటర్నెట్ డెస్క్: అమె వీధిలో నడుచుకుంటూ వెళుతోంది..చుట్టూ ఎవరూ లేని సమయం అది.. హఠాత్తుగా ఇద్దరు దొంగలు ఆమె ముందుకు దూకారు. కత్తితో బెదిరించి.. ఆమె చేతిలో ఉన్న కుక్కను ఎత్తికెళ్లిపోయారు. డబ్బుల కోసం దొంగలు వచ్చారని బాధితురాలు భావిస్తే.. వారేమో కుక్కను ఎత్తుకుపోయారు. కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిందీ ఘటన! ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా.. ప్రస్తుతం అమెరికా అంతటా ఇటువంటి ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి.  


ఈ కుక్కలు చిన్నగా..బుజ్జిగా..చూడటానికి ముచ్చటగా ఉండటం రెండో కారణం. ఇవి చంకనేసుకుని పారిపోగలిగేంత చిన్న సైజులో ఉండటంతో దొంగలకు తమ పని మరింత సులభమవుతోంది. ఇవి తక్కువ సంఖ్యలో పిల్లల్ని పెట్టేవి కావడం కూడా వీటి పాపులారిటీకి మరో కారణం. ఎక్కువగా ధనికులు, సెలబ్రిటీలు ఈ ఫ్రెంచ్ బుల్‌డాగ్స్‌ను పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రీమంతులు అధికంగా ఉండే హాలీవుడ్ వంటి ప్రాంతాల్లో నేర తీవ్రత పెరుగుతోంది. కుక్కలను ఎత్తికెళ్లిపోయే క్రమంలో దొంగలు వాటి యజమానులపై దాడులు చేసేందుకు కూడా వెనకాడట్లేదు. ఈ క్రమంలో బాధితులు ఆస్పత్రి పాలైన ఘటనలు కూడా ఉన్నాయి.  కాబట్టి.. ఈ కుక్కల యజమానులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తమ పెంపుడు కుక్కల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..దొంగల దృష్టిలో పడకండని సూచిస్తున్నారు.  


అయితే.. ఇటువంటి దొంగలు ఏ కుక్క కనిపిస్తే దాన్ని ఎత్తికెళ్లిపోరు! వారి టార్గెట్ ఫ్రెంచ్ బూల్‌గాడ్ జాతికి చెందిన కుక్కలే. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. గతేడాది ఏకంగా ప్రముఖ పాప్ స్టార్ కూడా ఇలాంటి అనుభవాన్నే చవి చూసింది. కొందరు ఆమె వద్ద ఉన్న ఫ్రెంచ్ బుల్‌డాగ్‌ను ఎత్తుకెళ్లిపోయారు. అయితే.. ఈ కుక్కలే దొంగలకు అంత ప్రియంగా మారటానికి మూడు కారణాలు ఉన్నాయని అక్కడి మీడియా వర్గాల కథనం. ఫ్రెంచ్ బుల్‌డాగ్‌లది అత్యంత అరుదైన జాతి కావడంతో వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే దాదాపు 5 వేల డాలర్లు( దాదాపు 3.71 లక్షల రూపాయలు) వస్తాయట. దీంతో.. దొంగలు వీటినే తమ టార్గెట్‌గా చేసుకుంటున్నారు. 

Updated Date - 2022-01-18T02:26:50+05:30 IST