ఫైనల్లో గ్రీకు వీరుడు

ABN , First Publish Date - 2021-06-12T10:31:48+05:30 IST

అద్వితీయ ఆటతీరుతో తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన గ్రీస్‌ ఆటగాడిగా స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ రికార్డు సాధించాడు. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఐదోసీడ్‌

ఫైనల్లో గ్రీకు వీరుడు

ఫ్రెంచ్‌ ఓపెన్‌

సెమీస్‌లో  జ్వెరేవ్‌ఫై సిట్సిపాస్‌ గెలుపు


పారిస్‌: అద్వితీయ ఆట సిట్సిపాస్‌తీరుతో తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన గ్రీస్‌ ఆటగాడిగా స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ రికార్డు సాధించాడు. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఐదోసీడ్‌ సిట్సిపాస్‌ 6-3, 6-3, 4-6, 4-6, 6-3తో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ)పై గెలిచాడు. సిట్సిపాస్‌ గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్స్‌ సెమీస్‌లోనే వెనుదిరిగాడు. 3 గంటల 37 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో 22 ఏళ్ల సిట్సిపాస్‌ 8 ఏస్‌లు సాధించగా, జ్వెరేవ్‌ 11 కొట్టాడు. కానీ ఓవరాల్‌గా ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన సిట్సిపాస్‌ చివరకు మ్యాచ్‌ను వశం చేసుకున్నాడు. 


వరుసగా ఆరు గేమ్‌లు..: ఆరంభంలోనే 3-0తో దూసుకెళ్లిన సిట్సిపాస్‌ తొలి సెట్‌ను 37 నిమిషాల్లోనే ముగించాడు. కానీ రెండో సెట్‌లో పుంజుకున్న జ్వెరేవ్‌ తన సర్వీ్‌సను కాపాడుకుంటూనే ఓ బ్రేక్‌ పాయింట్‌తో 3-0తో పైచేయి సాధించాడు. అయినా పట్టు వీడని సిట్సిపాస్‌ పదునైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో వరుసగా ఆరు గేమ్‌లను గెలుచుకుని 6-3తో సెట్‌ను ముగించాడు. ఇక మూడు, నాలుగు సెట్లను జ్వెరేవ్‌ 6-4, 6-4తో గెలవడంతో చివరి సెట్‌ అనివార్యమైంది. నిర్ణాయక సెట్‌లో మాత్రం సిట్సిపాస్‌ పదునైన ఫోర్‌హ్యాండ్‌, క్రాస్‌కోర్టు విన్నర్లతో చెలరేగాడు. నాలుగో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌తో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లిన సిట్సిపాస్‌ తన సర్వీ్‌సను కాపాడుకుని 4-1తో నిలిచాడు. ఆ తర్వాత ఎనిమిదో గేమ్‌లో జ్వెరేవ్‌ గట్టి పోటీనిచ్చి సిట్సిపాస్‌ నాలుగు మ్యాచ్‌ పాయింట్లను అడ్డుకున్నాడు. కానీ తొమ్మిదో గేమ్‌ను సిట్సిపాస్‌ ఏస్‌తో ముగించి తుది పోరుకు అర్హత సాధించాడు.


మహిళల డబుల్స్‌ ఫైనల్లోనూ క్రెజికోవా: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌తో పాటుగా డబుల్స్‌లోనూ చెక్‌ బ్యూటీ క్రెజికోవా ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌లో క్రెజికోవా-సినియాకోవా (చెక్‌) జోడీ 6-1, 6-2తో లినెట్‌ (పోలెండ్‌)-పెరా (అమెరికా)పై గెలిచింది. ఈ ఇద్దరికీ ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. ఒకవేళ సింగిల్స్‌, డబుల్స్‌ టైటిళ్లు నెగ్గితే మేరీ పియర్స్‌ (2000) తర్వాత ఈ ఫీట్‌ సాధించిన ప్లేయర్‌గా క్రెజికోవా నిలుస్తుంది.


Updated Date - 2021-06-12T10:31:48+05:30 IST