Abn logo
Sep 26 2020 @ 03:36AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు వెయ్యి మందే!

పారిస్‌: ఫ్రాన్స్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌కు అభిమానులను అనుమతించే విషయమై నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. మూడు వారాల క్రితం 11,500 మందిని అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ గయ్‌ ఫర్గెట్‌ చెప్పారు. కొద్దిరోజుల తర్వాత ఈ సంఖ్యను ఐదు వేలకు తగ్గించి టికెట్లు కూడా విక్రయించారు. తాజాగా ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 16 వేల కరోనా కేసులు బయటపడడంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు 1000 మందినే అనుమతిస్తున్నట్టు ఫర్గెట్‌ తెలిపారు. ‘క్రీడాకారులు, అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తాం’ అని ఫర్గెట్‌ చెప్పారు.


Advertisement
Advertisement
Advertisement