ఫ్రెంచి వాయుసేనలో హద్దుమీరిన ర్యాగింగ్.. స్తంభానికి కట్టేసి చుట్టూ బాంబులు!

ABN , First Publish Date - 2021-05-11T05:17:54+05:30 IST

ఫ్రాన్సులో ఘోరమైన ఘటన జరిగింది. దేశాన్ని కాపాడాలనే ఉత్సాహంతో వాయుసేనలో చేరితే.. అక్కడ కూడా యువకులను ర్యాగింగ్ భూతం వేధిస్తోంది.

ఫ్రెంచి వాయుసేనలో హద్దుమీరిన ర్యాగింగ్.. స్తంభానికి కట్టేసి చుట్టూ బాంబులు!

ప్యారిస్: ఫ్రాన్సులో ఘోరమైన ఘటన జరిగింది. దేశాన్ని కాపాడాలనే ఉత్సాహంతో వాయుసేనలో చేరితే.. అక్కడ కూడా యువకులను ర్యాగింగ్ భూతం వేధిస్తోంది. ఇక్కడ ఈ ర్యాగింగ్‌ను ‘హేజింగ్ రిచ్యువల్’ అంటారట. దీనికోసం తనను కిడ్నాప్ చేసి, టార్గెట్ ప్రాక్టీస్ చేసే స్తంభానికి కట్టేసి చుట్టూ బాంబులు వేశారని ఒక ఫ్రెంచి ఫైట్ జెట్ పైలట్ ఆరోపించారు. గతేడాది మే నెలలో ఫ్రెంచి ఎయిర్‌ఫోర్స్‌లో ఈ ఘటన జరిగిందట. సదరు పైలట్‌ను కిడ్నాప్ చేసి, ప్రాక్టీస్ మైదానానికి తీసుకెళ్లిన సీనియర్లు.. అతన్ని ఒక స్తంభానికి కట్టేసి, విమానాల్లో పైకెళ్లి అతని చుట్టూ మందుగుండు సామగ్రితో దాడి చేశారట. ఇదంతా ‘హేజింగ్ రిచ్యువల్’ అని చెప్పారట. మన భాషలో చెప్పాలంటే ఇది ర్యాగింగ్. ప్రస్తుతం దీని గురించి ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్‌లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-05-11T05:17:54+05:30 IST