జనాభా పెరిగిపోతోంది.. మేం పిల్లల్ని కనం.. ఆ దేశంలోని యూత్‌లో కొత్త ట్రెండ్..!

ABN , First Publish Date - 2021-07-13T01:06:25+05:30 IST

ప్రతి క్షణం భూమిపై కోట్లాది మంది ప్రాణం పోసుకుంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జనాభా రోజు‌రోజుకు పెరిగిపోతుంది. ఈ జన విస్పోటనం కారణంగా భూమిపై ఉన్న సహజ వనరులు తరిగిపోతున్నాయి. ఈ

జనాభా పెరిగిపోతోంది.. మేం పిల్లల్ని కనం.. ఆ దేశంలోని యూత్‌లో కొత్త ట్రెండ్..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి క్షణం భూమిపై కోట్లాది మంది ప్రాణం పోసుకుంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జనాభా రోజు‌రోజుకు పెరిగిపోతుంది. ఈ జన విస్పోటనం కారణంగా భూమిపై ఉన్న సహజ వనరులు తరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన యువతి,యువకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వల్ల భూమిపై మరింత భారం పెరగకూడదని సంకల్పించుకున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయం ఎవరికైనా నచ్చితే.. తమను ఫాలో కావొచ్చని ఇంటర్నెట్ వేదికగా పిలుపునిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


దినదినం పెరిగిపోతున్న జనాభా.. భూమిపై మానవాళి మనుగడను ప్రశ్నిస్తోంది. జనాభా విప్పోటనాన్ని అదుపు చేయకపోతే.. సహజ వనరులు పూర్తిగా అంతరించిపోయి.. భూమిపై జీవనం ఓ సవాలుగా మారుతుందని పర్యవరణ వేత్తలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దేశాలన్నీ కలిసి జూలై 11వ తేదీని  ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్ణయించి, ఆ రోజుకు మట్టుకు ప్రసంగాలతో ఊదర గొడుతున్నాయి. జనాభా నియంత్రణ చట్టాలను చేసినా.. వాటిని చాలా దేశాలు కఠినంగా అమలు పర్చలేకపోతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా విపరీతంగా జనాభా పెరిగిపోతుంది. 


ఈ క్రమంలో విద్యావంతులైన యువతీయువకులు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. జన విస్పోటనం, దాని పర్యావసానాలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11న మాత్రమే వారికి గుర్తొస్తాయి. ఆ ఒక్కరోజు మట్టుకు జూలై 11 విశిష్టతను వివరిస్తూ.. పెరిగిపోతున్న జనాభా పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌‌లతో సరిపెడుతున్నారు. అంతేతప్ప చదువుకోని వారిలో ఈ అంశంపట్ల అవగాహన పెంచే కార్యక్రమాలవైపు దృష్టి సారించడం లేదు. 



అయితే ప్రాన్స్‌కు చెందిన యువత.. జనభా పెరిగిపోవడం పట్ల జరిగే అనర్థాలను ఊహించడంతో పాటు తమ వంతుగా జనాభాను ఏ విధంగా తగ్గించొచ్చు అనే అంశంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో సంచలన నిర్ణయమే తీసుకున్నారు. పిల్లలను కనకూడదని సంకల్పించుకున్నారు. తమ వల్ల భూమిపై మరింత భారం పెరగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. 


ప్రపంచ జనాభా 7.8 బిలియన్ల‌కు చేరినందున అధిక జనాభాను నియంత్రించడానికి.. గ్లోబల్ వార్మింగ్‌ అదుపు చేయడానికి ‘చైల్డ్‌ఫ్రీ’ మార్గాన్ని ఎంచుకున్నట్టు వివరిస్తున్నారు. మనోన్ అనే 26ఏళ్ల యువతి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పిల్లలు కనడం అనేది నా నియమాలకు విరుద్ధం. నేను తీసుకున్న ఈ నిర్ణయంపై నాకు పూర్తి స్పష్టత ఉంది’ అని పేర్కొన్నారు. ‘ఈ భూమిపై నా పిల్లలను వదిలి వెళ్లాలనే కోరిక నాకు లేదు’ అని యూట్యూబర్ అన్నా బోగెన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ‘పెరుతున్న జనాభా కారణంగా భూమిపై వనరులు క్రమంగా తరిగిపోతాయి. నేను చనిపోయి.. ఆరడుగుల గోతిలో ఉన్నప్పుడు నాకు కలిగిన సంతానం.. వారి సంతానం పరిమిత వనరులతో జీవించాల్సి ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు’ అని చెప్పాడు. కాగా.. ఫ్రాన్స్ యువత తీసుకున్న నిర్ణయంపట్ల డెమోగ్రఫీ రెస్పాన్సబుల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డేనీస్ గార్నియర్ హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ వార్మింగ్, జన విస్పోటన సమస్యల గురించి యువత ఆలోచించడం గొప్ప విషయం అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.8బిలియన్లు ఉందని.. అది 2022 లేదా 2023 నాటికి 8 బిలియన్లకు చేరుతుందని వివరించారు. 


Updated Date - 2021-07-13T01:06:25+05:30 IST