విరిగిపడిన కొండచరియలు...జమ్మూ-శ్రీనగర్ హైవే బంద్

ABN , First Publish Date - 2022-01-12T12:38:28+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం వల్ల కొండచరియలు విరిగిపడినాయి....

విరిగిపడిన కొండచరియలు...జమ్మూ-శ్రీనగర్ హైవే బంద్

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం వల్ల కొండచరియలు విరిగిపడినాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లాలోని మెహర్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచి పోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కేబుల్ బ్రిడ్జీని పునరుద్ధరించేందుకు పనులు చేపట్టామని జాతీయ రహదారుల విభాగం అధికారి షబీర్ మాలిక్ చెప్పారు. భారీహిమపాతం, కొండ చరియలు విరిగిపడటం వల్ల కశ్మీరుకు దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారిని మూసివేశామని అధికారులు చెప్పారు.కశ్మీరులో మంగళవారం రాత్రి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్షియస్ కంటే తక్కువగా నమోదైంది. భారీ హిమపాతం వల్ల గుల్‌మార్గ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 10.6 సెల్షియస్‌లకు పడిపోయింది.భారీవర్షాలు, హిమపాతం కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది విమాన సర్వీసులు రద్దు చేశారు.లడఖ్‌లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురిసింది.


Updated Date - 2022-01-12T12:38:28+05:30 IST