స్నేహితుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-01-23T05:36:12+05:30 IST

స్నేహితుని వద్ద ఉన్న బంగారం కోసం నమ్మించి హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది.

స్నేహితుడు దారుణ హత్య

 బంగారం కోసం ఘాతుకం

ఆలస్యంగా వెలుగు చూసిన సంఘన

 పోలీసుల అదుపులో నిందితుడు

కొత్తపట్నం(ఒంగోలు నగరం), జనవరి 22: స్నేహితుని వద్ద ఉన్న బంగారం కోసం  నమ్మించి హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది. పల్లెపాలెంకు చెందిన కొక్కిలగడ్డ పిచ్చయ్య(33)ను స్నే హితుడు అయిల కోట్లింగం దారుణంగా హత్యచేసి అతని వద్ద ఉన్న  ఉంగరాలు, మెడలోని చైను మొత్తం ఆ రు సవర్ల బంగారం ఎత్తుపోయాడు. హత్య చేసిన కోట్లింగం అప్పటినుంచి గ్రామంలో తిరు గుతూనే ఉన్నాడు. తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. హతుని బంధువుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పొలీసులు కూపీ లాగితే డొంక కదలింది. 

కొత్తపట్నం పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు మేరకు.. పల్లెపాలెంకు చెందిన కొక్కిలగడ్డ పిచ్చయ్య, అయిల కోట్లింగం స్నేహి తులు, పిచ్చయ్య వద్ద ఉన్న బంగారంపై కోట్లింగం కన్నేశాడు. ఈనెల 14న వీరిద్దరు  ఈతముక్కల-సూరారెడ్డిపాలెం రోడ్డులోని పేరంటాళ్ల కుంట ప్రాంతంలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న పిచ్చ య్యను కోట్లింగం బీరు బాటిల్‌ను పగులకొట్టి పొడవడంతో చనిపో యాడని భావించి వెళ్ళిపోయారు. అయితే అనుమానం వచ్చి మళ్లీ వెళ్లిచూడగా పిచ్చయ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇది గుర్తించిన కోట్లింగం పిచ్చయ్య మొలత్రాడును తెంచి గొంతుకు బిగించి చంపేశాడు. 

హత్యచేసిన కోట్లింగం అనంతరం తిరిగి పల్లెపాలెం వచ్చి మామూ లుగానే తిరుగుతు న్నాడు. ఈ నేపథ్యంలో పిచ్చయ్య కనిపించటం లేదంటూ ఆయన భార్య అన్నపూర్ణ ఈ నెల 17న కొత్తపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు దొరకక పోవటంతో పోన్‌ కాల్‌ డేటాను పరిశీ లించారు. కోట్లింగం పలుమార్లు పిచ్చయ్య ఫోన్‌కు మాట్లాడినట్లు గు ర్తించారు. దీంతో కోట్లింగంను  శనివారం అదుపులోకి తీసుకొని విచా రించగా తానే హత్య చేసినట్టు అంగీకరించినట్టు తెలిసింది. కోట్లింగం ఇచ్చిన సమాచారం మేరకు  పేరంటాళ్ళ కుంట వద్ద కుళ్ళిన స్థితిలో ఉ న్న శవాన్ని గుర్తించి పోస్టు మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తర లించారు. ఒంగోలు డీఎస్పీ నాగరాజు, సీఐ రాఘవరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-01-23T05:36:12+05:30 IST